తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​

మహబూబాబాద్​లో ఈ నెల 4న తెరాస నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి

By

Published : Apr 2, 2019, 6:02 AM IST

ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి
ఈ నెల 4న మహబూబాబాద్​లో నిర్వహించనున్న కేసీఆర్​ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.

బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఎంపీ సీతారాంనాయక్​, ఎమ్మెల్యే శంకర్​ నాయక్​, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్​, ఎంపీ అభ్యర్థి మాలోత్​ కవిత ఉన్నారు.
ఇవీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details