రాష్ట్రంలో త్వరలో నూతన రెవెన్యూ, పురపాలక చట్టాలు రూపుదాల్చనున్నాయి. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేలా కొత్త చట్టాలను రూపకల్పన చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ అదేశించారు. ప్రగతిభవన్‌లో అధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు.
పట్టణాలు, నగరాల కోసం అర్బన్ పాలసీని తీసుకురావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కలెక్టర్‌ను అదే పేరుతో కొనసాగించాలా.. లేక పాలనాధికారులుగా పేరు మార్చాలో సూచించాలన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్ల నిర్వీర్యమైన పరిపాలనా విభాగాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల పరిషత్ విధుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేకుండా ప్రజల పనులు జరిగితేనే సంస్కరణల లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతిపై ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని.. లంచాలు లేని వ్యవస్థ కోసం కఠినంగా వ్యవహరించాలన్నారు.
అనుమతులు, ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అలసత్వం పనికిరాదన్న సీఎం... కారకులపై చర్యలు తీసుకావాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీ పాలన అందుబాటులో ఉండే విధానం రావాలన్నారు. జీహెంఎంసీ, హెచ్ఎండీఏలతోపాటు ఇతర పట్టణాల, నగరాలను అభివృద్ధి చేసేందుకు నూతన పాలసీ తీసుకురావాలని సూచించారు.
'అవినీతి, అలసత్వం రూపుమాపేలా చట్టాలు' ఇవీ చూడండి: ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా..?