కేరళ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. మరికాసేపట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ కానున్నారు. సమావేశంలో జాతీయ రాజకీయ ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను అంచనా వేసుకుని ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్, భాజపా పార్టీలకు మెజారిటీ రాకుండా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే అప్పడు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. అనంతరం రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శించుకుని హైదరాబాద్ వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్ - KERALA
సీఎం కేసీఆర్ ఐదురోజుల పర్యటనలో భాగంగా కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకొని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3206361-thumbnail-3x2-kcr.jpg)
అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్