తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'చిత్రనగరి'తో మెరిసిపోతున్న రాజ్​కోట్​

'చిత్రనగరి' కార్యక్రమంతో గుజరాత్​లోని రాజ్​కోట్​ రంగులమయంగా మారింది. స్వచ్ఛభారత్​, పర్యావరణ పరిరక్షణ, బేటీ బచావో​-బేటీ పడావో, ట్రాఫిక్​పై అవగాహన, నీటిని పరిరక్షించటం, ఇలా ఎన్నో రకాల సందేశాలతో  వేసిన చిత్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

'చిత్రనగరి'తో మెరిసిపోతున్న రాజ్​కోట్​

By

Published : Mar 26, 2019, 12:02 AM IST

'చిత్రనగరి'తో మెరిసిపోతున్న రాజ్​కోట్​
'చిత్రనగరి' కార్యక్రమంతో గుజరాత్​లోని రాజ్​కోట్​ రంగులమయంగా మారింది. నగరంలో ఎటు చూసినా సందేశాత్మక చిత్రాలు దర్శనమిస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..

స్వచ్ఛభారత్​, పర్యావరణ పరిరక్షణ, బేటీ బచావో​-బేటీ పడావో, ట్రాఫిక్​పై అవగాహన, నీటిని పరిరక్షించటం, ఇలా ఎన్నో రకాల సందేశాలతో వేసిన చిత్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

దాదాపు 1200 మంది చిత్రకారులు ఎటువంటి ఆర్థిక లబ్ధి ఆశించకుండా ఉచితంగా ఈ చిత్రాలు వేయటం విశేషం. ఇందులో చిన్నారులు, యువకులు కూడా ఉన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భవనాలు, పాఠశాలల గోడలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, సెంట్రల్​ జైలు ఇలా ప్రతి చోటా వేసిన చిత్రాలతో రాజ్​కోట్​ మరింత అందంగా తయారైంది.

సమాజానికి చిత్రాల ద్వారా సందేశాన్ని అందించే ఈ చిత్రనగరి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు పూర్తిగా సహకరిస్తున్నారు. అందువల్ల మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details