పేరులో ఉన్న విజయం జీవితంలోకి ఎప్పుడొస్తుందో అంటున్నాడు టాలీవుడ్ యవహీరో సాయిధరమ్ తేజ్. ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్రలహరి'. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
విజయం కోసం ఎదురుచూసే ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించనున్నాడీ మెగాహీరో. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిశోర్ ప్రత్యేక పాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ఐదుగురు చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.