తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాలి

ఉగ్రభూతానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

By

Published : Feb 14, 2019, 11:47 PM IST

Updated : Feb 14, 2019, 11:54 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ జమ్ముకశ్మీర్​ ఉగ్రఘటనపై స్పందించారు. పుల్వామాలో జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

"పుల్వామాలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఉగ్రభూతానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకతాటిపైకి రావాలి"

- రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ట్వీట్

ఈ ఉగ్రదాడిలో 42 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. జైషే మహమ్మద్ సంస్థ ఈ ఉగ్రఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించింది.

Last Updated : Feb 14, 2019, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details