భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, పంచాయితీరాజ్‌శాఖ అధికారులతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతు పనుల కోసం రూ.7 కోట్ల నిధులను మంజూరు చేశారు. 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. త్వరలోనే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఎవ్వరికి లంచాలు ఇవ్వొద్దని, నేరుగా తన దగ్గరికి వచ్చి పనులు చేసుకోవొచ్చని ఎమ్మెల్యే సూచించారు.
'ఎవ్వరికీ లంచాలివ్వొద్దు... నా దగ్గరికి రండి' - CHEQUES DISTRIBUTION
"ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకుంనేందుకు గానీ... లబ్ధి పొందేందుకు గానీ ఎవ్వరికీ లంచాలు ఇవ్వొద్దు. మధ్యవర్తులను సంప్రదించొద్దు. నేరుగా నా దగ్గరికొచ్చి మీ పనులు చేసుకొండి" అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు.
CHEQUES DISTRIBUTION
TAGGED:
CHEQUES DISTRIBUTION