తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2021, 1:07 AM IST

Updated : Apr 22, 2021, 5:37 AM IST

ETV Bharat / briefs

ఉత్కంఠ పోరులో సూపర్‌కింగ్స్‌ విజయం

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు గెలుపొందింది. కోల్​కతా 202 పరుగులకే ఆలౌట్​ అవ్వగా.. ఆండ్రూ రస్సెల్​, పాట్ కమిన్స్​ అర్ధశతకాలు వృథా అయ్యాయి.

Chennai Super Kings won by 18 runs
చెన్నైదే విజయం.. కోల్​కతాకు తప్పని ఓటమి

ముంబయి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ గెలుపొందింది. 221 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన మోర్గాన్​ సేన.. 19.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యింది. దీంతో కోల్​కతా బ్యాట్స్​మెన్ ఆండ్రూ రస్సెల్​(54), పాట్​ కమిన్స్​(66) అర్ధశతకాలు వృథా అయ్యాయి. వీరితో పాటు దినేశ్​ కార్తిక్​ మినహా కోల్​కతా జట్టులో మిగిలిన బ్యాట్స్​మన్​ ఎవ్వరూ రాణించలేకపోయారు. దీపక్​ చాహర్​ 4, లుంగి ఎంగిడి 3, సామ్​ కరన్​ ఒక్క వికెట్​ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(64), డుప్లెసిస్‌(95 నాటౌట్​) దంచి కొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకు బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే వరుణ్‌ చక్రవర్తి వేసిన 13వ ఓవర్‌లో రుతురాజ్‌.. కమిన్స్‌ చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

ఆపై మొయిన్‌ అలీ(25) కాసేపే క్రీజులో ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో అతడు నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అప్పటికి చెన్నై స్కోర్‌ 165/2. తర్వాత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ(17), డుప్లెసిస్‌ ధాటిగా ఆడారు. చివర్లో ధోనీ ఔటైనా కోల్‌కతా ముందు ధోనీసేన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Last Updated : Apr 22, 2021, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details