తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇందూరులో చెడ్డీగ్యాంగ్ హల్​చల్ - నిజామాబాద్

చెడ్డీగ్యాంగ్ నిజామాబాద్ జిల్లాలోనూ పంజా విరిసింది. జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఓ కాలనీలో బీభత్సం సృష్టించింది.

చెడ్డీగ్యాంగ్ హల్​చల్

By

Published : Jun 3, 2019, 3:49 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ హల్​చల్ చేసింది. ముబారక్​నగర్​లో ఓ ఇంట్లో చొరబడేందుకు యత్నించింది. ఓ ఇంటి తలుపులు తీయాలంటూ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పపడ్డారు. రెండు గంటలకు పైగా బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు గురి చేశారు. ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మరో ఇంట్లో భార్యభర్తలను బెదిరించి మంచానికి కట్టేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.

చెడ్డీగ్యాంగ్ హల్​చల్

ABOUT THE AUTHOR

...view details