తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'జలవివాదాలపై అఖిలపక్షమే కరెక్ట్' - Cpi Chada On Kcr

తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. పలు సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం శుభసూచకమన్నారు.

అట్టహాసంలో కేసీఆర్

By

Published : Jun 28, 2019, 6:34 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జల వివాదాలపై ఏకపక్షంగా వ్యవహారించకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా ఎక్కువని వాటిని తగ్గించుకునే విషయంలో అఖిలపక్షం నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా విషయంలో పోరాడాలని సూచించారు.

అప్పుల్లో తెలంగాణ ఉంటే అట్టహాసంలో కేసీఆర్ ఉన్నాడని... తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనెలాగా సీఎం వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ కడతామని చెప్పి ఇప్పుడు సచివాలయం నిర్మాణం చేస్తున్నాడని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడతాడని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు పడుతూ.. సీపీఐ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చాడ స్పష్టం చేశారు.

అప్పుల్లో తెలంగాణ.. అట్టహాసంలో కేసీఆర్

ఇవీ చూడండి: 'కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details