తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పొల్లాచ్చి కేసు సీబీఐకి బదిలీ

తమిళనాడులో దుమారం రేపిన పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును సీబీఐకి అప్పగించింది సీబీ-సీఐడీ.

పొల్లాచ్చి

By

Published : Mar 14, 2019, 9:59 PM IST

తమిళనాడులోని పొల్లాచ్చిలో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిననలుగురు యువకులపై జరుపుతున్నవిచారణను సీబీఐకి అప్పగించిందిసీబీ-సీఐడీ.ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా ఇటు ప్రజల్లోనూ, అటు రాజకీయంగా తీవ్రదుమారం రేపింది.

నిందితులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ నేపథ్యం

సామాజిక మధ్యమాల్లో యువతులను పరిచయం చేసుకుని, వారిని లైంగికంగా వేధించసాగారు శబరి, వసంత కుమార్​, సతీష్​ కుమార్​, తిరువునాక్కరసు అనే నలుగురు యువకులు.

పొల్లాచ్చికి చెందిన ఓ 19 ఏళ్ల యువతికి ఇదే విధమైన అనుభవం ఎదురైంది. మనోవేధనకు గురైన ఆ యువతి తన సోదరుడితో ఈ విషయాన్ని చెప్పింది. యువతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో పరియం అయిన యువతులను స్నేహం పేరుతో వంచించి వారిని లైంగికంగా వేధించడం ఆ నలుగురు యువకులపని అని గుర్తించారు పోలీసులు. ఇలా ఇప్పటి వరకు50 మంది యువతులపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుసుకున్న పోలీసులు... విస్తుపోయే నిజాలు వెల్లడించారు.

యువతులను వేధించి ఆ వీడియోలను చరవాణిలో చిత్రీకరించి... వారిని డబ్బులకు, లైంగిక వాంఛల కోసం వాడుకుంటున్నారని వెల్లడించారు పోలీసులు.చెప్పినట్లు చేయకపోతే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పరువు పోతుందనే భయంతో ఇంతవరకు ఎవరూ పిర్యాదు చేయనందున ఈ దారుణం ఇన్ని రోజులు గుట్టుగా సాగింది.

ఇందులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కేసు దర్యాప్తును సీబీ- సీఐడీకి అప్పగించినట్టు తమిళనాడు డీజీపీ రాజేంద్రన్​ తెలిపారు. తాజాగా కేసును సీబీఐకి బదిలీ చేసింది సీబీ-సీఐడీ.

ABOUT THE AUTHOR

...view details