తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బాచుపల్లి పోలీస్​స్టేషన్​లో రామ్​గోపాల్​ వర్మపై కేసు - case

సినీ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు అభిమానులు, కార్యకర్తల మానోభావాలను కించపరిచినట్లు దేవిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

రామ్​గోపాల్​ వర్మపై కేసు

By

Published : Apr 14, 2019, 8:56 PM IST

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్​స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మ తన ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు మార్ఫింగ్ చేసి వైఎస్‌ఆర్​సీపీలో చేరుతున్నట్లు పెట్టాడని... అతనిపై చర్యలు తీసుకోవాలని దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి చంద్రబాబు అభిమానులు, తెదేపా కార్యకర్తల మనోభావాలను కించపరిచారని దేవిబాబు చౌదరి పేర్కొన్నారు. ఆర్​జీవీ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకునేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వర్మపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

రామ్​గోపాల్​ వర్మపై కేసు

ABOUT THE AUTHOR

...view details