వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రక్షణ ఖర్చులపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ తర్వాతే కాగ్ నివేదించిన విషయాలు బహిర్గతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
"2019లో రక్షణ అంశాలపై కాగ్ నివేదక నెం.20 ను బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అనుకున్న దాని కన్నా ముందే సమావేశాలు ముగిశాయి. అందువల్ల ఈ నివేదికను వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
రాజకీయ దుమారం..
అయితే ప్రస్తుత కాగ్ నివేదికకు సంబంధించి ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కొన్ని వార్తా కథనాల ఆధారంగా చూపి కాగ్ నివేదికలో రఫేల్ ఒప్పందాన్ని చేర్చలేదని ఆరోపించారు. అసలు ప్రభుత్వానికి కాగ్ ఇచ్చిన నివేదికలో రఫేల్ అంశమే లేదని మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంతో భారత ఖజానాను దొంగలించారని ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
"తన తండ్రి పాపాలను కడిగేందుకు రాహుల్ రఫేల్ అంశాన్ని వినియోగించటం పార్టీకే నష్టం చేకూర్చుతుందని ఆయన సహచరులే చెబుతున్నారు. వాళ్ల పతనం వాళ్లే కోరుకుంటే మేం ఏం చేస్తాం? రఫేల్‌పై 2024 ఎన్నికల్లో పోరాడేందుకు రాహుల్‌ను ఆహ్వానిస్తున్నా."
- పీయూష్ గోయల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి
ఇదీ చూడండి:'రఫేల్ విషయంలో దేశ ఖజానా దోపిడీకి గురైంది'