తెలంగాణ

telangana

'బుల్లెట్'​ పాటలో మెరిసిన పాయల్ రాజ్​పుత్

By

Published : Apr 3, 2019, 11:59 AM IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాయల్ రాజ్​పుత్.. ప్రత్యేక గీతంలో మెరిసింది. బుల్​రెడ్డి అనే పాటతో కుర్రకారును ఆకట్టుకోనుంది.

బుల్​రెడ్డి పాటతో కుర్రకారు మతి పోగొడుతున్న పాయల్ రాజ్​పుత్

'ఆర్.ఎక్స్​ 100'తో హీరోయిన్​గా మెప్పించింది పాయల్ రాజ్​పుత్. ఇప్పుడు ప్రత్యేక గీతంతో అలరించేందుకు సిద్ధమైంది. 'సీత' సినిమాలో ఆమె నటించిన 'బుల్లెట్​ మీదొచ్చే బుల్​రెడ్డి' అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. అనూప్ రుబెన్స్ సంగీతమందించిన ఈ గీతం మాస్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారీ సినిమాలో. 'నేను రాజు నేనే మంత్రి' సినిమాతో ఫామ్​లోకి వచ్చిన తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనూసూద్ విలన్​గా కనిపించనున్నాడు. మే నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details