తెలంగాణ

telangana

ETV Bharat / briefs

స్కూటర్​పై ముగ్గురు.. ఆసక్తికరంగా 'బ్రోచేవారెవరురా' లుక్ - 'బ్రోచేవారెవరురా' ఫస్ట్​లుక్

విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు తన కొత్త చిత్రం.. 'బ్రోచేవారెవరురా' ఫస్ట్​లుక్​తో ఆకట్టుకుంటున్నాడు.

ఆసక్తి కలిగిస్తున్న 'బ్రోచేవారెవరురా' సినిమా ఫస్ట్​లుక్

By

Published : Mar 21, 2019, 5:38 PM IST

వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామా శ్రీవిష్ణు. మొదటి సినిమా ‘మెంటల్‌ మదిలో’నూ విభిన్న కథాంశంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము - చిత్రమే చలనము.. అనేది ఉపశీర్షిక.

హీరోయిన్​గా నివేదా థామస్‌ నటిస్తుండగా.. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హోలీ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఓ వింటేజ్‌ స్కూటర్‌పై రంగు రంగుల దుస్తుల్లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ కలిసి వస్తున్న ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది.

ఆసక్తి కలిగిస్తున్న 'బ్రోచేవారెవరురా' సినిమా ఫస్ట్​లుక్

ABOUT THE AUTHOR

...view details