తెలంగాణ

telangana

అమెజాన్​పై వెనక్కి తగ్గిన బ్రెజిల్​.. విదేశీ సాయానికి ఓకే

By

Published : Aug 28, 2019, 7:01 AM IST

Updated : Sep 28, 2019, 1:34 PM IST

అమెజాన్​ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేయడానికి విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు బ్రెజిల్ అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు అధ్యక్షుడు బొల్సొనారో ప్రతినిధి.

అమెజాన్​పై వెనక్కి తగ్గిన బ్రెజిల్​.. విదేశీ సాయానికి ఓకే

అమెజాన్​ అడవుల అంశంలో విదేశాల ఆర్థిక సాయంపై వెనక్కి తగ్గింది బ్రెజిల్​. ఇతర దేశాల నుంచి వచ్చే నిధులను పొందేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు బ్రెజిల్​ అధ్యక్షుడి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"స్వచ్ఛంద సంస్థలు, విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు బ్రెజిల్​ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బ్రెజిల్​కు వచ్చే ఈ నిధులు దేశ ప్రజల అధీనంలో ఉంటాయి."

- ఒటావియో రెగో బరోస్​, బ్రెజిల్​ అధ్యక్షుడి ప్రతినిధి.

తొలుత నిరాకరణ..

పర్యావరణానికి కేంద్ర బిందువుగా ఉన్న అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చు చెలరేగి వేల హెక్టార్లు మేర ధ్వంసమయింది. ఈ విపత్తుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేయటమే కాదు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే విదేశీ ఆర్థిక సాయాన్ని తీసుకునేందుకుబ్రెజిల్​ అధ్యక్షుడు బొల్సొనారో నిరాకరించారు.

ఇటీవలే ఫ్రాన్స్​లో జరిగిన జీ-7 సదస్సులో అమెజాన్​ కార్చిచ్చును అదుపు చేసేందుకు 20 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించాయి సభ్య దేశాలు. కానీ ఆ సాయాన్ని బ్రెజిల్​ తిరస్కరించింది. అవి యూరప్​లో అరణ్యాల పునరుద్ధరణకు ఉపయోగించాలని హితవు పలికింది.

సెప్టెంబర్​ 6న సమావేశం...

అమెజాన్​ అడవులను రక్షించడానికి పెరూ అధ్యక్షుడు మార్టిన్​ విజ్కారా, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్​ సమావేశానికి పిలుపునిచ్చారు. అమెజాన్​ను పరిరక్షించటం, అభివృద్ధి చేయటం, అటవీ సమాజానికి మేలు చేసే లక్ష్యంగా కొలంబియాలో సెప్టెంబర్​ 6న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఇతర దేశాలకు ఆహ్వానం ఉంటుందా అన్న దానిపై స్పష్టత నివ్వలేదు. పెరూ, కొలంబియా, బ్రెజిల్​ దేశాల సరిహద్దు ప్రాంతంలోని లెథీసియాలో ఈ సమావేశం జరగనుంది.

ఇదీ చూడండి:అమెజాన్​ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు

Last Updated : Sep 28, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details