ఇంటర్ బోర్డు అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ బీజేవైఎం ఆందోళన చేపట్టింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేవరకు దశల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ స్పష్టం చేశారు. నాయకులు చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
లక్ష్మణ్‌కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో - LAXMAN
ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేలా భాజపా శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీజేవైఎం రాస్తారోకో నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్షకు సంఘీభావం తెలిపింది.
లక్ష్మణ్‌కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో