తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేటి నుంచి రాష్ట్రంలో భాజపా అగ్రనాయకుల ప్రచారం - అమిత్​షా

ఈరోజు నుంచి రాష్ట్రంలో కమలం పార్టీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు సభల్లో పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు.

భాజపా ప్రచారం

By

Published : Apr 2, 2019, 6:30 AM IST

Updated : Apr 2, 2019, 8:41 AM IST

రాష్ట్రంలో భాజపా అగ్రనేతల ప్రచారం
లోక్​సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల తరఫున రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్, మహబూబాబాద్​లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్​నగర్, హైదరాబాద్​లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.

రైల్వేశాఖ మంత్రి పీయూష్​​ గోయల్ ఈనెల 3న ఖమ్మం, నాగర్​కర్నూల్ పార్లమెంట్​ పరిధిలోని కొల్లాపూర్​లో జరిగే ప్రచార సభలకు హాజరుకానున్నారు. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​షా ఈనెల 4న కరీంనగర్, వరంగల్ సభల్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మరో విడత రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈనెల 5న సికింద్రాబాద్, మల్కాజిగిరి సభల్లో పాల్గొంటారని కమలం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. అదే రోజున ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదిలాబాద్, జహీరాబాద్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.

ఇదీ చదవండి :మెజార్టే మీ పనితీరుకు సూచిక: కేటీఆర్

Last Updated : Apr 2, 2019, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details