తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'పశువ్యాధుల నియంత్రణకు బయోవెట్​ వ్యాక్సిన్లు' - biovet-investment-in-karnataka

ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్​ఎండీ ఉత్పత్తిదారుగా బయోవెట్ అవతరించిందని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. 200 కోట్ల పెట్టుబడితో కర్ణాటకలో పరిశ్రమను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.

biovet

By

Published : Jun 20, 2019, 7:11 PM IST

Updated : Jun 20, 2019, 7:55 PM IST

పశువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా బయోవెట్ సంస్థ వ్యాక్సిన్ల ఉత్పత్తిని విస్తృతం చేస్తోందని బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. జంతువులకు సోకే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధులను నివారించే ఎఫ్​ఎండీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని 200 మిలియన్ డోసుల నుంచి 500 మిలియన్ డోసులకు పెంచనున్నామన్నారు. కర్ణాటకలోని మాలూర్‌లో 200 కోట్ల పెట్టుబడితో మరో పరిశ్రమను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఏర్పడ్డ ఎఫ్​ఎండీ వ్యాక్సిన్ల కొరతను తగ్గించడంతో పాటు స్థానికులకు పెద్దమొత్తంలో ఉపాధి కల్పించేందుకు మాలూర్‌లోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

200 కోట్లతో కర్ణాటకలో పరిశ్రమ
Last Updated : Jun 20, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details