తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బిహార్ భాజపా నేత ఇంటిని పేల్చేసిన మావోయిస్టులు - anujkumar singh

ఛత్తీస్​గడ్ మినహా మిగిలినచోట్ల మావోయిస్టుల బెడద తగ్గుముఖం పడుతుందనుకుంటే దేశంలో ఎక్కడో ఒకచోట తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా బిహార్​లోని ఓ భాజపా నేత ఇంటిని బాంబులతో కూల్చేశారు మావోయిస్టులు.

పేలుడు ధాటికి కూలిపోయిన ఇల్లు

By

Published : Mar 29, 2019, 1:02 AM IST

Updated : Mar 29, 2019, 2:27 AM IST

బిహార్ భాజపా నేత ఇంటిపై మావోల బాంబుదాడి
బిహార్​ గయాలోని దుమారియాలో ఓ భాజపా నేత ఇంటిని బాంబులతో కూల్చివేశారు నక్సల్స్. మాజీ ఎంఎల్​సీ అనుజ్​కుమార్​ సింగ్​కు చెందిన నివాసంపై బాంబులతో దాడి చేశారు. డైనమైట్లతో పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

"కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన 20-30 మంది నక్సల్స్ ఆయుధాలు ధరించి భాజపా నేత ఇంటిపై దాడి చేశారు. ఇంటిలో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం జరగలేదు "-రాజీవ్​ మిశ్రా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గయా

ఎన్నికలను బహిష్కరించాలని గోడపత్రికలను వేశారు మావోయిస్టులు. ఈ విషయంపైనా పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

Last Updated : Mar 29, 2019, 2:27 AM IST

ABOUT THE AUTHOR

...view details