తెలంగాణ

telangana

ETV Bharat / briefs

విభిన్న లుక్​తో 'బిగ్ బి' కోలీవుడ్​​ అరంగేట్రం - SJ SURY

విభిన్న పాత్రలు చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్న మెగాస్టార్ అమితాబ్ బచ్చన్...ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. అందులో పంచెకట్టు లుక్​తో ఆకట్టుకుంటున్నాడు.

పంచెకట్టు లుక్​లో ఆకట్టుకుంటున్న అమితాబ్ బచ్చన్

By

Published : Apr 1, 2019, 6:10 PM IST

ఇంతకాలం బాలీవుడ్‌ చిత్రసీమకే పరిమితమైన బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.. దక్షిణాది సినిమాల వైపు దృష్టిసారించాడు. కోలీవుడ్​లో తమిళ్‌వాణన్‌ తెరకెక్కిస్తున్న ‘ఉయర్నత మణిదాన్‌’లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. సంబంధిత ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు నటుడు ఎస్​.జె. సూర్య.

ట్విట్టర్​లో ఎస్.జె.సూర్య ట్వీట్

అమితాబ్‌ సర్‌తో కలిసి పనిచేస్తున్నా. నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణమిది. నేనెప్పుడూ కనని కల నెరవేరింది. ఈ సందర్భంగా దేవుడికి, అమ్మానాన్నలకు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు, మురుగదాస్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా

--ట్విట్టర్​లో ఎస్.జె.సూర్య

ఇందులో బిగ్‌బీకి జోడీగా రమ్యకృష్ణ నటించబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

ఇటీవలే చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లో షూటింగ్​ను పూర్తి చేసుకున్నాడు అమితాబ్.

ABOUT THE AUTHOR

...view details