మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు - undefined
"ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి అన్నదాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్మినా... సరైన సమయంలో డబ్బు ఇవ్వకుండా రైతన్నలను కష్టపెడుతున్నారు'' అని ఎంపీ కోమటిరెడ్డి ఆవేదన చెందారు.
![మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3531248-thumbnail-3x2-komati.jpg)
మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు
మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు
రబీ ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించిన తర్వాత కూడా అధికారులు డబ్బు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన చెందారు. మూడ్రోజుల్లో డబ్బు వస్తుందని ఆశతో 6.25 లక్షల మంది అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే....మూడు నెలలైనా నగదు చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నించారు. రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేసుకుంటారని, వెంటనే డబ్బు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.