ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకూడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరు ఖరారైన తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేవలం కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయమని కేటీఆర్ కోరుతున్నారని.. ఇంతకాలం పనిచేసిన తెరాస ఎంపీలు ప్రజలకు ఏం చేశారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
భువనగిరిలో గెలిచేది నేనే - కేసీఆర్
కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ పెద్ద బూటకమని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన చుట్టూ కుటుంబ సభ్యులే ఉన్నారని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి