యాత్రికుల్లో ఉగ్రవాదులున్నారా! - ఖలిస్థాన్
కర్తార్‌పుర్ యాత్రికులకు ఖలిస్తానీ ఉగ్రవాదానికి సంబంధాలున్నాయా అని భారత్ పాక్‌ను ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరింది. ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోమని పునరుద్ఘాటించింది.
కర్తార్‌పూర్ యాత్రీకులకు ఖలిస్థానీ సంబంధాలపై పాక్‌ను ఆరా తీసిన భారత్
కర్తార్‌పుర్ యాత్రికులకు ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలకు ఏ విధమైన సంబంధాలున్నాయో నిర్ధరించాలని దాయాది పాకిస్థాన్‌ను భారత్ కోరింది. ఉగ్రవాద కార్యకలాపాల్ని సహించబోమని స్పష్టం చేసింది. భారత్ సూచన మేరకు ఇరు దేశాధికారుల సమక్షంలో యాత్రికులకు ఉగ్రవాదానికి సంబంధం లేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ సమావేశం ఇరు దేశాల చర్చలకు నాంది కాదని భారత్ ప్రకటించింది. భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఏవిధమైన చర్యలకు పాల్పడవద్దని పాక్‌కు సూచించింది.