తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"అప్పుడు ఛాయ్​వాలా... ఇప్పుడు రఫేల్​వాలా"

రఫేల్​ అంశంపై 2015లో రక్షణ శాఖ రాసిన ఓ నోట్​ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం మరింత తీవ్రమయ్యేందుకు కారణమైంది. శుక్రవారం పార్లమెంటును కుదిపేసిన రఫేల్​ ప్రకంపనలు.... సభ బయటా కొనసాగాయి.

మమతా బెనర్జీ, ప్రధాని మోదీ

By

Published : Feb 9, 2019, 6:27 AM IST

Updated : Feb 9, 2019, 8:25 AM IST

రఫేల్​పై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం
రఫేల్​ ఒప్పందంపై ప్రతిపక్షాలు మరోసారి అధికార భాజపాపై మాటల యుద్ధానికి దిగాయి. రక్షణ శాఖ అభ్యంతరం తెలిపినా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం నేరుగా సమాంతర చర్చలు జరిపిందన్న వార్తల్ని విమర్శనాస్త్రాలుగా మలుచుకున్నాయి. ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించాయి.

కాపలాదారే దొంగ..

రఫేల్​ వ్యవహారంలో ప్రధాని కార్యాలయమే మధ్యవర్తిగా వ్యవహరించిందని ఆరోపించింది కాంగ్రెస్. పీఎంఓ జోక్యంపై వచ్చిన వార్తలపై మోదీ వివరణకు డిమాండ్​ చేసింది.

రఫేల్​ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్​. కాపలాదారే దొంగ అని తేలిందంటూ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.

"మోదీ రూ.30వేల కోట్లు దోపిడీ చేశారు. రక్షణ శాఖ స్పష్టంగా చెప్పింది. రఫేల్​పై ప్రధాని ఫ్రాన్స్​తో సమాంతర చర్చలు జరిపారని స్పష్టమైంది. నిజం బయటకు వచ్చింది. ప్రధాని జోక్యంపై రక్షణ శాఖ స్వయంగా అభ్యంతరం తెలిపింది. దేశ ప్రజల సంపద రూ.30వేల కోట్లను అనిల్​ అంబానీకి దోచిపెట్టారు."
-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఛాయ్​వాలా నుంచి రఫేల్​వాలా..

రఫేల్​ ఒప్పందంలో కుంభకోణం జరిగిందన్నారు పశ్చిమ్​ బంగ సీఎం మమతా బెనర్జీ.

"ఎన్నికల ముందు మోదీ ఛాయ్​వాలాగా ఉంటారు. ఎన్నికల తర్వాత రఫేల్​వాలాగా మారిపోయారు. రఫేల్​లో అవకతవకలు జరిగాయి. రఫేల్​ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణం. ఈ విషయంలో కాంగ్రెస్​కు పూర్తి మద్దతు ఇస్తాం" -- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

మాకో నిబంధన... వారికో నిబంధనా?

రఫేల్​ విషయంపై ప్రధాన మంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు జరపాలని అన్నారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. సీబీఐ స్వతంత్ర విచారణ జరిపి, కుంభకోణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

భాజపా ఎదురుదాడి

ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు భాజపా నేత అనురాగ్​ ఠాకూర్​. దేశ రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా రఫేల్​ ఒప్పందం చేసుకుందని స్పష్టం చేశారు.

"రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేతలకు అబద్ధం చెప్పడం అలవాటుగా మారింది. ఈ దేశంలో రక్షణ ఒప్పందం ఎలా జరుగుతుందో వారికి తెలియదు. "
-- అనురాగ్​ ఠాకూర్​, భాజపా నేత

Last Updated : Feb 9, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details