తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దివ్యాంగుల సంభాషణ ఇక సులభతరం.! - BDD ASSIST

దివ్యాంగుల సంభాషణలు సులభతరం చేసేందుకు ప్రత్యేక యంత్రాన్ని రూపొందిస్తున్నాడు బెంగళూరు విద్యార్థి.

దివ్యాంగుల సంభాషణ ఇక సులభతరం.!

By

Published : Feb 14, 2019, 11:16 PM IST

దివ్యాంగుల సంభాషణ ఇక సులభతరం.!
వినికిడి లోపం, మాట్లాడలేక పోవడం, కంటి చూపు సమస్యలతో బాధపడేవారికి ఇతరులతో సంభాషించడాన్ని సులభతరం చేసేందుకు వినూత్న పరికరాన్ని రూపొందిస్తున్నాడు బెంగళూరుకు చెందిన విద్యార్థి.

హెచ్​ఎం రోచన బెంగుళూరులోని ఏఎంసీ కళాశాలలో పన్నెండో తరగతి చదువుతున్నాడు.

ప్రోగ్రామింగ్, రోబోటిక్స్ అంటే రోచనకు అమితాసక్తి. ప్రొఫెసర్ డా.కె వెంకటేష్​తో కలిసి అంధత్వ సమస్యలు గుర్తించే స్మార్ట్​ కేన్ పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాడు. ఈ క్రమంలోనే దివ్యాంగులు సంభాషణలో ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక యంత్రాన్ని ఆవిష్కరించాలని సంకల్పించాడు.

బ్లైండ్​, డెఫ్ అండ్​ డమ్​​(బీడీడీ) అసిస్ట్​ యంత్రాన్ని రూపొందించేందుకు తన ఆలోచనలకు పేటెంట్​ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

ప్రస్తుతం బ్రెయిల్​ లిపి, సైగల ద్వారా మాత్రమే దివ్యాంగులు ఇతరులతో సంభాషిస్తున్నారు. రోచన రూపొందిస్తున్న యంత్రంతో ఇతర భాషల వారికి సైతం సందేశం చేరవేయడం సులభతరం అవుతుంది.

యంత్రం పని చేసే విధానం

బీడీడీ పరికరంలో ఇన్​పుట్, అవుట్​పుట్​ మెథడ్స్​ ఉంటాయి. ఇతరులతో సంభాషించాలనుకున్న వ్యక్తి తాను చెప్పాలనుకున్న విషయాన్ని మాటల్లో, రాతల్లో, సైగలలో, బ్రెయిల్​ లిపిలో తెలియజేయాలి. వీటిని బీడీడీ పరికరం సరిగ్గా గుర్తించి ఎదుటి వారికి అర్థమయ్యే మాటల్లోకి, భాషలోకి తర్జుమా చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటుంది.

బ్రెయిలీ​ లిపిలో పొందుపరిచిన ఇన్​పుట్​ను యూనిఫైడ్​ ఇంగ్లిష్​ బ్రెయిలీ(యూఈబీ), అమెరికన్​ సైన్​ లాంగ్వేజ్​(ఏఎస్​ఎల్​)ల ఆధారంగా అవుట్​పుట్​లోకి తర్జుమా చేస్తుంది. ఇంగ్లీష్​ మాటలను, రాతను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి తెరపై ప్రదర్శిస్తుంది.

ఆంగ్ల భాషను బెంగాలీ, గుజారాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు , ఉర్దూ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి తర్జుమా చేయగలదు ఈ యంత్రం.

బీడీడీ టీచింగ్​ మోడ్​

బ్రెయిలీ లిపి, సైగల గురించి అవగాహన లేని వారికి ఆ భాషలను నేర్పించే సదుపాయం ఈ పరికరంలో పొందుపరిచారు.

ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ధరను రూ.6000లుగా నిర్ణయించారు. ఈ యంత్రాన్ని స్మార్ట్​ఫోన్​, టాబ్లెట్​, కంఫ్యూటర్​లకు సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details