కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం - కరీంనగర్‌లో దూసుకుపోతున్న బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కమలం వికసించింది. తెరాస పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్‌పై భాజపా అభ్యర్థి బండి సంజయ్ భారీ మెజార్జీతో గెలుపు బావుటా ఎగురవేశారు.
దూసుకుపోతున్న బండి
కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించారు. 19 రౌండ్లు ముగిసేసరికి అధికార తెరాస అభ్యర్థి వినోద్ కుమార్‌పై 74 వేల ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. మొదటిసారిగా ఎంపీ బరిలో నిలిచిన బండి సంజయ్ గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.