ఎన్నికల వరకు రాజకీయాలు.. ఆ తర్వాత పూర్తిగా అభివృద్ధిపైనే తాను దృష్టి సారిస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు కార్పొరేటర్, మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం భాజపా కల్పించిందని పేర్కొన్నారు. తనకు మంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలన్నింటిని కలుపుకొని ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానంటున్న ఎంపీ బండి సంజయ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...
ఎన్నికల వరకే రాజకీయాలు.. అభివృద్ధే నా ధ్యేయం! - bjp mp
అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. తనకు మంత్రి కావలనే ఆశ లేదని స్పష్టం చేశారు.
అభివృద్ధే నా ధ్యేయం!
ఇవీ చూడండి: ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమం
Last Updated : May 27, 2019, 11:45 PM IST