హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయతోపాటు పలువులు నేతలు శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. కశ్మీర్ అంశంపై నెహ్రుతో ముఖర్జీ విభేదించి రాజీనామా చేశారని లక్ష్మణ్ గుర్తుచేశారు. జూలై 6న శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి రోజున దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. తెలంగాణలో తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపానే అని స్పష్టం చేశారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్ దివస్ ' - తెలంగాణ భాజపా
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా బలిదాన్ దివస్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ పాల్గొని శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. జూలై 6న నుంచి సభ్యత్వ నమోదు చేపడతామన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్ దివస్ '