సినిమా బాగుంటే రీమేక్ చేయాడానికి ఎవరూ వెనుకాడటం లేదు. మన సినిమాలు బాలీవుడ్లోకి వెళ్తున్నాయి. అక్కడి సినిమాలు ఇక్కడ రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో హిందీ చిత్రం చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన 'బదాయి హో'ను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేయనున్నారు బోనీ కపూర్. ఇప్పటికే అమితాబ్ నటించిన 'పింక్' చిత్రాన్ని అజిత్ హీరోగా తమిళంలో నిర్మిస్తున్నారు బోనీ
హిందీ కామెడీ దించేస్తున్నారు! - బోనీ కపూర్ నిర్మాణంలో బదాయి హో చిత్రంలో దక్షిణాదిలో తెరకెక్కనుంది
ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన 'బదాయి హో' సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేయనున్నారు నిర్మాత బోనీ కపూర్.
బోనీ కపూర్ నిర్మాణంలో బదాయి హో చిత్రం దక్షిణాదిలో తెరకెక్కనుంది
అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మేర వసూళ్లు సాధించింది. లేటు వయసులో గర్భం దాల్చిన ఓ గృహిణి, కుటుంబ సభ్యుల మధ్య జరిగే హాస్యభరిత కామెడీతో ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. ఇప్పుడీ చిత్రంలో ఎవరు నటిస్తారో చూడాలి.
Last Updated : Mar 19, 2019, 11:39 PM IST