తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'బాబ్రీ' చిత్రం పెద్దలకు మాత్రమే.!

'రామ్​ కే నామ్'​ చిత్రానికి యూట్యూబ్ షరతు విధించింది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూసేలా ఈ వీడియో షేరింగ్​ యాప్​ తాత్కాలిక నిబంధన పెట్టింది. ఈ సినిమాపై వీక్షకులు ఇచ్చిన రివ్యూల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

'బాబ్రీ' చిత్రం పెద్దలకు మాత్రమే.!

By

Published : Feb 13, 2019, 7:56 AM IST

ముంబై :ప్రముఖ ఫిల్మ్​మేకర్​ ఆనంద్​ పట్వర్థన్ నిర్మించిన 'రామ్​ కే నామ్​' చిత్రానికి యూట్యూబ్​లో వయో నిబంధన విధించారు. ఈ చిత్రాన్ని పెద్దల చిత్రాల సరసన చేర్చడం పట్ల ఆయన నిరసన తెలిపారు. కేంద్ర సెన్సార్​ బోర్డు యూ సర్టిఫికేట్​ ఇస్తే... 28 సంవత్సరాల తరవాత యూట్యూబ్​ ఇలా చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాలో...1992లో విశ్వహిందూ పరిషత్ రాముని ఆలయం కట్టేందుకు మసీదును ఎలా కూల్చింది, ఆ సమయంలో చెలరేగిన అల్లర్లు గురించి ప్రస్తావించారు.
28 ఏళ్ల తరవాత...
సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్​సీ) ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్​ ఇచ్చింది.1996లో దూరదర్శన్​లో ఈ చిత్ర ప్రసారానికి అనుమతిచ్చింది హైకోర్టు.​ ఈ డాక్యుమెంటరీ జాతీయ అవార్డునూ గెలుచుకోవడం విశేషం.

' జై భీమ్​ కామ్రేడ్​ చిత్రానికి గతంలోనూ ఇలానే జరిగింది. యూట్యూబ్​ సీబీఎఫ్​సీ కన్నా దారుణంగా వ్యవహరిస్తోంది' అంటూ పట్వర్ధన్ విమర్శించారు.
'రామ్​ కే నామ్​' చిత్రాన్ని ప్రస్తుతం రివ్యూ కోసం ఉంచామని.. నెటిజన్ల అభిప్రాయాల ఆధారంగానే వయో పరిమితి పెట్టినట్లు బదులిచ్చింది యూట్యూబ్​. రివ్యూ పరిశీలించి కమ్యూనిటీ గైడ్​లైన్స్​కి వ్యతిరేకంగా లేకపోతే అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details