మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గులామ్ నబీ ఆజాద్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆత్మగౌరవ సభకు ఆజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ, కేసీఆర్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో రెండేళ్ల చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత గల కుటుంబ నేపథ్యమున్న విశ్వేశ్వర్‌రెడ్డిని 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని ఆజాద్ విజ్ఞప్తి చేశారు.
మోదీ, కేసీఆర్ ఈవీఎంలను కూడా దొంగిలిస్తున్నారు - AZAD ON MODI, KCR
"నాయకులు కావాలని కొందరు, డబ్బు సంపాదించాలని ఇంకొందరు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ... కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం సమాజానికి సేవ చేసేందుకు వచ్చారు. కొండా కుటుంబంలో తన తాత, తండ్రులు కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు."- గులాం నబీ ఆజాద్
చేవెళ్ల ఆత్మగౌరవ సభలో ఆజాద్
TAGGED:
AZAD ON MODI, KCR