గత ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంకు రాని ముఖ్యమంత్రి పాలన విధానంపై మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఏ అధికారులైనా అవినీతికి పాల్పడుతున్నారంటే అది మీ వల్లనేనని కేసీఆర్ వల్లేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జీవన్ రెడ్డి సీఎంను నిలదీశారు.
అవినీతికి తెరాస మార్గదర్శకంగా నిలిచింది: జీవన్ రెడ్డి - undefined
స్థానిక సంస్థలు నిర్వీర్యం కావటానికి కారణం తెరాస ప్రభుత్వ పనితీరేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ కేటీఆర్ చెబితేనే లంచం తీసుకుంటున్నానని ధైర్యంగా చెప్పారన్నారు.
అవినీతికి తెరాస మార్గదర్శకంగా నిలిచింది: జీవన్ రెడ్డి
TAGGED:
jeevan reddy