ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. వరుసగా 21 వన్డేల్లో గెలిచి, పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 2003లో సాధించిన ఘనతను సమం చేసింది. 2017 అక్టోబరు 29న మొదలైన వీళ్ల విజయాల పరంపర.. ఇప్పటివరకు సాగింది. ఇకపైనా సాగే అవకాశముంది.
పాంటింగ్ రికార్డ్ సమం.. ఆస్ట్రేలియా మహిళా జట్టు ఘనత
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ పాంటింగ్‌తో సమంగా వన్డేల్లో 21 విజయాలు నమోదు చేశారు.
ఆస్ట్రేలియా మహిళా జట్టు
బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరిగిన వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై 232 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా మహిళలు విజయం సాధించారు. తాత్కాలిక కెప్టెన్ రేచల్ 104 పరుగులతో ఆకట్టుకోగా, హేలీ 87 పరుగులు చేసింది. ఛేదనలో కివీస్ బృందం 93 పరుగులకే ఆలౌటైంది. సాట్తర్వైట్ 41, మ్యాడీ గ్రీన్ 22 పరుగులు మాత్రమే చేశారు. కానీ తమ జట్టును గెలిపించలేకపోయారు.
Last Updated : Oct 7, 2020, 4:33 PM IST