తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాపలదారు దేశానికి చేసిందేమి లేదు: అసదుద్దీన్ - అసదుద్దీన్​ ఓవైసీ

కాపలదారు అని చెప్పుకునే ప్రధాని దేశ రక్షణను గాలికొదిలేశారని మండిపడ్డారు మజ్లిస్​ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ

By

Published : Mar 24, 2019, 7:14 AM IST

దేశంలో అనిశ్చితికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ ఆరోపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. శనివారం హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్​లో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ కార్పోరేటర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇంట్లో ఎవరూ లేకుంటే ట్రంప్​ను కౌగిలించుకుంటావా అంటూ... ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మజ్లిస్​ అధినేత. ఆహ్వానం అందనిదే పాకిస్థాన్​లోని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళతారని విమర్శించారు. కాపలాదారు అని చెప్పుకునే ప్రధాని పుల్వామా దాడిలో జవాన్లు చనిపోతే ఇంట్లో పడుకున్నావా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని... కొందరు హస్తం పార్టీ నేతలు తనకు ఫోన్ చేసి మీ ద్వారా కేసీఆర్​తో కలుస్తామని కోరుతున్నారని ఓవైసీ తెలిపారు.

మజ్లిస్​ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

ఇవీ చూడండి:మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం: తెరాస

ABOUT THE AUTHOR

...view details