తమిళ నటుడు ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్‌ను ఈ నెల 10న వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మరో సినిమాలో నటించనుందీ జంట. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న "టెడ్డీ" చిత్రంలో ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు ఆర్య, సాయేషా. కేఈ జ్ఞాన్వేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
"కొత్త సినిమాలో కొత్త జంట" - టెడ్డీ
ఈ మధ్యే వివాహం చేసుకున్న ఆర్య-సాయేషా జంట ముచ్చటగా మూడోసారి వెండితెరపై కనిపించనుంది.
ముచ్చటగా మూడోసారి వెండితెరపై కనిపించనున్న ఆర్య-సాయేషా జంట
ఇప్పటికే భలేభలే మగాడివోయ్ రీమేక్‌గా తెరకెక్కిన "గజనీకాంత్"లో మొదటిసారిగా కలిసి నటించారు. సూర్య హీరోగా మోహన్‌లాల్ కీలక పాత్రలో వస్తున్న "కాప్పన్" చిత్రంలోనూ వీరు కనిపించనున్నారు.