25 మంది చిత్రకారులు ఒకే వేదికపై విభిన్న రకాల చిత్రాలతో కొలువుదీరింది హైదరాబాద్ పర్యాటక భవన్‌లోని రెయిన్‌బో ఆర్ట్ గ్యాలరీ. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు చిత్రకళాభిమానులు పాల్గొన్నారు. దేవతమూర్తుల చిత్రాలు, స్వచ్ఛభారత్, సామాజిక చిత్రాలు, ప్రకృతి సొయగాలు ఇలా అన్నీ రకాలైన చిత్రాలు కళాప్రియులను అలరిస్తున్నాయి.
అందమైన చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్ - చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్
కళాకారుల కుంచె నుంచి జాలువారిని వర్ణచిత్రాలు వీక్షకులను మంత్రమగ్ధులను చేస్తుంటాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో అర్థం. దేనికదో విభిన్నం. అలా ఆకట్టుకునే వర్ణ చిత్రాలతో కొలువుదీరింది రెయిన్ బో ఆర్ట్ గ్యాలరీ.
చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్