తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యోగాలో నయా ట్రెండ్​... మీరు ట్రై చేయండి! - INTERNATIONAL YOGA DAY

ఫిట్​నెస్​ ఇప్పుడు ప్రతి ఒక్కరూ జపిస్తున్న మంత్రం. జిమ్​, వాకింగ్, డైటింగ్​, యోగా ఇలా ఒకటేమిటీ... ఇదీ అదీ అని తేడా లేకుండా అన్నింటినీ ట్రై చేస్తోంది నేటి యువత. అంతా ఆరంభ శూరత్వమే అన్నట్టుగా కొన్ని రోజులకే అన్నీ మూలనపడుతున్నాయి. కారణం వర్క్​అవుట్​ బోరింగ్​గా అనిపించడమే. అందుకే కాస్త భిన్నంగా... మరింత ఉల్లాసంగా మారుస్తోంది ఏరియల్​ యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏరియల్​ యోగా మీద ఓ లుక్కేద్దాం..!

areal-yoga

By

Published : Jun 21, 2019, 6:53 AM IST

యోగాలో నయా ట్రెండ్​...

వర్క్​అవుట్​ ఏదైనా కాస్త ఆహ్లాదభరితంగా... మరింత ఉత్సాహపూరితంగా ఉంటే ఆ మజా వేరు. ఇదే నేటితరం మనసుకు నచ్చే వర్క్​అవుట్​ తీరు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా సరికొత్త హంగులు అద్దుకుని ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని... చల్లని గాలులు పీలుస్తూ యోగాసనాలు వేస్తుంటే... ఆ కిక్కే వేరప్పా. తనువు మనసును ఏకం చేస్తూ.. మనిషిలోని శక్తిని పునరుత్తేజపరిచేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.

కాస్త వినూత్నంగా చేద్దాం:

ఒంటరిగా కూర్చుని యోగా చేయటం ఓ వ్యాయామంలా అనిపిస్తుంది. అదే నలుగురితో పాటు కలిసి సరదాగా ఆడుతూ... పాడుతూ వినూత్నంగా చేసే యోగా నూతన ఉత్తేజాన్ని... రోజూ వారి ఒత్తిడుల నుంచి మరింత ఉపశమనం ఇస్తోంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఏరియల్​ యోగా. ఇప్పటి ఈ నయా ట్రెండ్​ యువతను బాగానే ఆకర్షిస్తోంది. హ్యామక్​ సహాయంతో చేసే ఈ యోగా తమకు ఎంతాగానో ఉపయోగపడుతుందంటున్నారు కొందరు యువత.

ఎలాంటి ఆసనమైనా సులువే:

సాధారణంగా యోగాని మ్యాట్​పై చేస్తాము కానీ ఈ ఏరియల్​ యోగాలో మాత్రం... సిల్క్​ క్లాత్​ని హుక్​కి వేలాడదీసి వాటి సహాయంతో యోగాసనాలు వేస్తారు. దీనినే హ్యామక్​ అని కూడా అంటారు. పెల్లాటిస్​, యోగా, డాన్స్​ ఫార్మ్స్​ని కలిపి చేసేదే ఈ ఏరియల్​ యోగా. ఆసనాలు వేయడం కాస్త కష్టతరమైన విషయం. అయితే ఈ ఏరియల్​ యోగాలో ఎంతటి క్లిష్టమైన ఆసనాన్నైనా... సునాయాసంగా వేసేయెచ్చు. అంతే కాదు... శరీరానికి మంచి ఫ్లేక్సిబులిటీతో పాటు... హెవీ వెయిట్స్​ లిఫ్ట్​ చేసినప్పుడు కలిగే అనుభూతిని కూడా ఆస్వాధించవచ్చు. అందుకే ఇప్పుడు ఈ నయాట్రెండ్​కి జై అంటున్నారు యువతరం. ప్రతిదానిలో కొత్తదనం కోరుకునే నవతరాన్ని ఈ ఏరియల్​ యోగా ఎంతగానో ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశానికి చేరుతోంది.

మీరూ ట్రై చేయండి:

సరదాగా ఆడుతూ... పాడుతూ... హ్యామక్​లతో మాయాజాలం చేసినట్టు కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ... ఎక్కువ సేపు ఆసనంలో ఉండే అవకాశాన్ని కల్పించేదే ఈ ఏరియల్​ యోగా. మరింకెందుకు ఆలస్యం... ఈ యోగాడేని పురస్కరించుకుని మీరు ఇలా ఓ ఆసనం వేసేయండి.

ఇదీ చూడండి:చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు

ABOUT THE AUTHOR

...view details