డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీవం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్, ఉత్తమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'నా నంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్' అంటూ కేటీఆర్‌ను ఉత్తమ్ సరదాగా ప్రశ్నించారు. 'నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు' అని కేటీఆర్ అన్నారు. కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తానని.. ‘మీ నంబర్ బ్లాక్ చేయలేదు’ అంటూ కేటీఆర్ సమాధానమిచ్చారు.
నంబర్ బ్లాక్ చేశావా? - uttam ktr meet
రాజకీయ వేదికలపై తీవ్ర స్థాయిలో విమర్శించుకునే నేతలు... సరదాగా ముచ్చటించుకున్నారు. ఫోన్ నంబర్ బ్లాక్ చేశావంటూ ఒకరు ప్రశ్నిస్తే... ఫోన్ చేస్తే ఎత్తవ్ అని ఇంకొకరు ప్రశ్నించారు. ఈ సరదా సంభాషణ ఎక్కడ? ఎవరి మధ్య? జరిగింది. చూసేయండి.
![నంబర్ బ్లాక్ చేశావా?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2527252-632-eafebfa4-f966-4b32-addb-0db04bbe5a41.jpg)
నంబర్ బ్లాక్ చేశావా?