ఐదు కాఫీ రకాలకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్‌ను ప్రకటించింది భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు లోయలో పండే అరబికా కాఫీ జీఐను దక్కించుకుంది. అలాగే కర్ణాటకకు చెందిన చిక్కమగళూరు, బాబుదాన్గిరీస్, కూర్గ్‌లో లభ్యమయ్యే అరబికా రకాలకు వెరైటీలకూ స్థానం దక్కింది. కేరళకు చెందిన కాఫీ రకం వాయనాడ్ రోబస్టా సైతం చోటు దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, ఒడిశాలో 900-1100మీటర్ల ఎత్తైన పర్వతప్రాంతాల్లో అరకు అరబికా కాఫీ రకం ఉత్పత్తి అవుతోంది. అరకు కాఫీని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తారు. వాయనాడ్ రోబస్టా కాఫీ పంటలను కేరళలోని తూర్పు ప్రాంతాల్లో పెంచుతారు.
బాబుదాన్ గిరీస్ కాఫీని చిక్కమగళూరులోని మధ్యప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తారు. చిక్కమగళూరు భారతీయ కాఫీకి జన్మస్థలంగా ప్రసిద్ధి పొందింది. సహజ సిద్ధ కిణ్వ ప్రక్రియ ద్వారా ఈ కాఫీ పొడిని తయారుచేస్తారు. అరోమా కలిసిన చాక్లెట్ రుచితో దీనిని రూపొందిస్తారు. మరో రకమైన చిక్కమగళూరు రకం సైతం ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. కూర్గ్ కాఫీ రకం కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉత్పత్తి చేస్తారు.
కేరళలో ఉత్పత్తయ్యే వాయనాడ్ రోబస్టా కాఫీ మొక్కలను తూర్పు ప్రాంతమైన మలబార్ ప్రాంతంలో పెంచుతారు.