తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హాలీవుడ్ చిత్రానికి స్వర మాంత్రికుడి సంగీతం - దక్షిణాది బాషల్లో పాటలు

సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏ ఆర్ రెహమాన్ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. భారతీయ భాషల్లో విడుదలయ్యే 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమాకు స్వరాలు సమకూర్చనున్నాడు.

హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్​కు సంగీతం అందించనున్న ఏ ఆర్ రెహమాన్

By

Published : Mar 27, 2019, 8:30 AM IST

హాలీవుడ్‌ సినిమాల్లో భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌’. ఆంథోని, జోయ్‌ రూసో దర్శకత్వం వహించారు. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలను సమకూర్చబోతున్నారు. ఈ మేరకు మార్వెల్‌ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఏ ఆర్ రెహమాన్

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. 2014లో ప్రారంభమైన అవెంజర్స్‌ సిరీస్‌లో ఇది చివరిది.

‘‘భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సరైన సంగీత దర్శకుడు’’ అని మార్వెల్‌ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details