తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కమల దళపతి వెంటే అగ్రనాయకులు - NAMINATION

నేడు గాంధీనగర్​ లోక్​సభ స్థానానికి భాజపా అధ్యక్షుడు అమిత్​ షా నామపత్రం దాఖలు చేయనున్నారు. షా వెంట పార్టీ అగ్రనేతలు రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ సహా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే హాజరుకానున్నారు.

కమల దళపతి వెంటే.. అగ్రనాయకులు!

By

Published : Mar 30, 2019, 7:00 AM IST

కమల దళపతి వెంటే.. అగ్రనాయకులు!
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా నేడు గాంధీనగర్​ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేయనున్నారు. కాషాయ దళపతికి మద్దతుగా పార్టీ అగ్రనాయకులు తరలిరానున్నారు. కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ సహా మిత్రపక్షాల అధినేతలు ఉద్ధవ్​ ఠాక్రే, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, రామ్​ విలాస్​ పాసవాన్​ హాజరుకానున్నారు.

గాంధీనగర్​ నుంచి పోటీ విషయంలో అమిత్​ షాకు పూర్తి మద్దతుందని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

నామపత్ర దాఖలుకు ముందు నరాన్​పురాలోని సర్దార్​ పటేల్​ విగ్రహం నుంచి పాటీదార్​ చౌక్​ వరకు 4 కి.మీ మేర రోడ్​షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అడ్వాణీని కాదని..!

1998 నుంచి గాంధీనగర్​ స్థానంలో భాజపా అగ్రనేత అడ్వాణీదే గెలుపు. అలాంటి ప్రతిష్టాత్మక స్థానంలో అడ్వాణీని కాదని తొలిసారి భాజపా అధ్యక్షుడు అమిత్​ షాకు సీటు కేటాయించింది పార్టీ. ఇంతకుముందు షా గుజరాత్​ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details