తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాజీవ్​కుమార్​పై ముగిసిన సీబీఐ విచారణ - సీబీఐ

శారదా కుంభకోణం కేసులో కోల్​కతా సీపీ రాజీవ్​కుమార్​పై సీబీఐ విచారణ ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో 20 గంటలపాటు అధికారులు రాజీవ్ కుమార్​ను విచారించారు.

కోల్​కతా సీపీ రాజీవ్​ కుమార్​

By

Published : Feb 11, 2019, 6:59 AM IST

Updated : Feb 11, 2019, 8:18 AM IST

రాజీవ్​కుమార్​పై ముగిసిన విచారణ
శారదా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​కుమార్​ పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ఆదివారంతో ముగిసింది. రాజీవ్​, తృణముల్​ మాజీ ఎంపీ కృనాల్ ఘోష్​ల​ను ఒకే సారి ప్రశ్నించారు.

మొదటి రోజు తొమ్మిది గంటలు, రెండో రోజు 11 గంటలు ఈ విచారణ కొనసాగింది. శారదా కుంభకోణం కేసులో రాజీవ్​కుమార్​​, సాక్ష్యాధారాలు మాయం చేశారన్న అభియోగాలను మోపింది సీబీఐ. విచారణ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలన్న రాజీవ్​ అభ్యర్థనను సీబీఐ అంగీకరించలేదు.

శారదా కుంభకోణం​ కేసుకు సంబంధించి 2013లో కృనాల్​ను అరెస్టు చేశారు. 2016 నుంచి ఆయన బెయిల్​ మీద ఉన్నారు. ఈ కేసులో 12 మందితో పాటు భాజపా నాయకుడు ముకుల్ రాయ్​ నిందితులుగా ఉన్నారు.

సీబీఐకి కేసు అప్పగించడానికి ముందు శారదా కుంభకోణంపై, రాజీవ్​కుమార్​ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) విచారణ జరిపింది. కంపెనీ దివాలా తీసిన అనంతరం దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ బృందాన్ని నియమించారు.

Last Updated : Feb 11, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details