తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భారత్ భేరి: కర్ణాటకలో 'క్షుద్ర'రాజకీయాలు!

ఎన్నికల్లో విజయానికి నాయకులు సర్వశక్తులు ఒడ్డుతారు. కొందరు ధనప్రవాహానికీ వెనుకాడరు. అయితే ఇవేం అవసరం లేకుండా క్షుద్ర పూజలతో ఎన్నికల్లో విజయం వరించేలా చేస్తారట కర్ణాటకలోని స్వామీజీలు! అందుకే ఇప్పుడు పలు రాష్ట్రాల రాజకీయ నాయకులు కొల్లిగల్​ పట్టణానికి వరుస కడుతున్నారు.

భారత్ భేరి: కర్ణాటకలో 'క్షుద్ర'రాజకీయాలు!

By

Published : Apr 4, 2019, 5:31 PM IST

కర్ణాటకలో 'క్షుద్ర'రాజకీయాలు!
కొల్లిగల్​... కర్ణాటక చామరాజనగర్​ జిల్లాలో ఓ చిన్న పట్టణం. ఎన్నికలొస్తే మాత్రం ఇక్కడకు రాజకీయ నాయకులు వరుస కడతారు. అందుకు కారణం క్షుద్ర పూజలు. ఔను మీరు విన్నది నిజమే.. రాజకీయ నాయకులకు, క్షుద్ర పూజలకు సంబంధమేంటి? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తే ఎన్నికల్లో విజయం తథ్యమన్నది నాయకుల నమ్మకం.

వివిధ రాష్ట్రాల్లోని నాయకులు ఇక్కడకు వచ్చి శాంతి పూజలు నిర్వహిస్తారట. ప్రస్తుతం కొల్లిగల్​లో దాదాపు 30 మంది సాధువులు ఉన్నారని సమాచారం. శ్మశానంలో, నదీ తీరాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎన్నికల్లో విజయం సాధించడానికి నాయకులు ఈ సాధువులను అర్ధరాత్రి కలుస్తుంటారు. ఎన్నికల్లో ప్రత్యర్థుల ఓటమి కోసం శ్మశానాల్లో 'శత్రు నివారణ' పూజలు చేయిస్తుంటారు.

లోటు లేని వ్యాపారం!

కొంతమంది సాధువుల వేషాలు వేసుకొని మోసం చేస్తున్నారు. పూజలు నిర్వహిస్తామని చెప్పి ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు మాత్రం ప్రస్తుతం కొల్లిగల్​లో నిజమైన సాధువులు లేరని వారెప్పుడో కేరళకు తరలిపోయారంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details