25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఏడుగురు బీసీలకు, ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం ఇవ్వగా వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3 కేటాయించారు. కాపు, రెడ్డి వర్గాలకు నాలుగుచొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
జగన్ మంత్రివర్గం ఇదే:
- ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం)
- బొత్స సత్యనారాయణ (విజయనగరం)
- పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
- అవంతి శ్రీనివాస్ (విశాఖ)
- కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
- పినిపె విశ్వరూప్ (తూర్పుగోదావరి)
- పిల్లి సుభాష్‌చంద్రబోస్ (తూర్పుగోదావరి)
- కొడాలి నాని (కృష్ణా)
- వెల్లంపల్లి శ్రీనివాస్ (కృష్ణా)
- పేర్ని నాని (కృష్ణా జిల్లా)
- బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
- మేకపాటి గౌతమ్ రెడ్డి (నెల్లూరు)
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
- ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
- చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
- తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
- మేకతోటి సుచరిత (గుంటూరు)
- మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
- ఆదిమూలపు సురేష్ (ప్రకాశం)
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
- గుమ్మనూరు జయరాం (కర్నూలు)
- నారాయణస్వామి (చిత్తూరు)
- అంజాద్ బాషా (కడప)
- శంకర్‌నారాయణ (అనంతపురం)
- అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు)