తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మరో అవకాశం - review

ఓటరు జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడుతున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన‌కిషోర్ తెలిపారు.

ప్రత్యేక ప్రచార కార్యక్రమం

By

Published : Mar 2, 2019, 6:15 AM IST

Updated : Mar 2, 2019, 10:00 AM IST

ప్రత్యేక ప్రచార కార్యక్రమం
నేడు, రేపు హైదరాబాద్​లో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌, నూత‌న ఓట‌ర్ల న‌మోదు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నిక‌ల అధికారి దాన‌కిషోర్ తెలిపారు. ఓట‌రు న‌మోదు ప‌ర్యవేక్షణ అధికారుల‌తో ఆయన స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు పొందేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాజ‌కీయ పార్టీల‌కు చెందిన బూత్ స్థాయి ఏజెంట్‌లు కూడా హాజ‌రు అయ్యేవిధంగా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకే వ్యక్తి రెండు ఓట్లు క‌లిగి ఉంటే తొల‌గించాల‌ని ఎన్నికల అధికారి దానకిషోర్పేర్కొన్నారు.

Last Updated : Mar 2, 2019, 10:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details