రోబో 2.0, ఐ, ఎవడు చిత్రాలతో హీరోయిన్గా అందరికి తెలిసిన నటి అమీ జాక్సన్. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉందీ భామ. న్యూఇయర్ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది అమీ.
తల్లి కాబోతున్నట్లు అమీ జాక్సన్ ప్రకటన - AMY JACKSON
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపింది.
![తల్లి కాబోతున్నట్లు అమీ జాక్సన్ ప్రకటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2858714-106-ddc0319b-1faa-4e4f-82a3-d6c64990d209.jpg)
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన అమీ జాక్సన్
ప్రస్తుతం యనైటెడ్ కింగ్డమ్లో ఉందీ నటి. అక్కడ మార్చి 31న మదర్స్ డే జరుపుకుంటారు. అందుకే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.
ఇవీ చదవండి: