పార్థు... ఈ పేరు వినగానే మహేష్ హీరోగా నటించిన `అతడు` సినిమానే గుర్తుకొస్తుంది. ఇంతకీ ఆ పేరు ప్రస్తావన ఇప్పుడెందుకంటారా? ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఫిలిం ఛాంబర్‌లో `పార్థు` టైటిల్ రిజిస్టర్ చేయించింది. త్రివిక్రమ్ దర్శకుడిగా అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం కోసమే ఈ టైటిల్ అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
పార్థుగా కనిపించనున్న బన్నీ - ALLU ARJUN
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకు "పార్థు" టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో కథ ఉండనుందని సమాచారం.
ఫిలింఛాంబర్లో పార్థు టైటిల్ రిజిస్టర్ చేయించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ
ఇంతకు ముందు వీరిద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ప్రస్తుత చిత్రం పట్టాలెక్కడంలో ఆలస్యమవుతున్నా... విడుదల మాత్రం తొందరగానే ప్లాన్ చేశారట. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే కథని సిద్ధం చేశారని సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ ఇదివరకు చేసిన `సన్నాఫ్ సత్యమూర్తి` కూడా తండ్రీ కొడుకుల అనుబంధంతోనే తెరకెక్కింది.