తెలంగాణ

telangana

ETV Bharat / briefs

క్వార్టర్స్​లో లక్ష్యసేన్, సింధు.. ప్రణయ్ ఔట్​ - Satwiksairaj

ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో క్వార్టర్స్​లోకి దూసుకెళ్లారు భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్, పీవీ సింధు. లక్ష్య వరుస సెట్లలో గెలిచి.. పిన్న వయసులో ఈ టోర్నీ క్వార్టర్స్​కు వెళ్లిన భారత పురుష షట్లర్​గా నిలిచాడు. సింధు రెండో రౌండ్​లో డెన్మార్క్​ క్రీడాకారిణిని చిత్తుచేసింది. మరోవైపు.. వరుస సెట్లలో ఓడిన హెచ్​ఎస్ ప్రణయ్ టోర్నీ నుంచి వైదొలిగాడు.

All England: Lakshya enters quarterfinals, Prannoy loses in second round
క్వార్టర్స్​లోకి లక్ష్యా సేన్.. నిష్క్రమించిన ప్రణయ్

By

Published : Mar 18, 2021, 7:18 PM IST

Updated : Mar 19, 2021, 9:15 AM IST

ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు భారత యువ షట్లర్ లక్ష్య సేన్. మహిళల సింగిల్స్​ రెండో రౌండ్​లో పీవీ సింధు కూడా గెలిచి క్వార్టర్స్​కు దూసుకెళ్లింది. మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్​ఎస్ ప్రణయ్​ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

గురువారం జరిగిన రెండో రౌండ్​లో ఫ్రాన్స్​కు చెందిన థామస్ రౌక్సెల్​పై 21-18, 21-17 తేడాతో విజయం సాధించాడు లక్ష్య. పిన్న వయసులో ఈ టోర్నీ క్వార్టర్స్​కు వెళ్లిన భారత పురుష షట్లర్​గా రికార్డు సృష్టించాడు.

మరోవైపు సింధు.. డెన్మార్క్​ క్రీడాకారిణి క్రిస్టోఫర్​పై 21-8, 21-8 తేడాతో అలవోక విజయం సాధించింది.

ప్రణయ్​ ఔట్​..

ఇక ప్రపంచ నెం.1 కెంటో మొమొటా చేతిలో రెండో రౌండ్​లో 21-15, 21-14 తేడాతో వరుస సెట్లలో ఓడి ఇంటిముఖం పట్టాడు ప్రణయ్.

అంతకుముందు జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​ రెండో రౌండ్​లో సాత్విక్ సాయిరాజ్- అశ్వినీ పొన్నప్ప జోడీ ఓటమిపాలైంది. జపాన్​కు చెందిన యుకీ కనెకో-మిసాకి మత్సుతోమో ద్వయం చేతిలో 21-19, 21-9 తేడాతో పరాజయం పొందింది.

ఇదీ చూడండి:ఆల్​ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి సైనా ఔట్

ఇదీ చూడండి:ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​: సింధు విజయం- శ్రీకాంత్​, కశ్యప్​ ఔట్​

Last Updated : Mar 19, 2021, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details