"కరోనాతో అందరూ చాలా బాధల్లో ఉన్నారు. అందుకే వాళ్లని తీసుకొచ్చి రెండు గంటలు నవ్వించి పంపాలన్నది నా కోరిక. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో(most eligible bachelor movie release date) ఆ కోరిక తీరుతుందని నమ్మకంగా చెప్పగలను" అన్నారు నిర్మాత బన్నీవాసు. ఇప్పుడాయన నిర్మాణంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(akhil pooja hegde movie name). బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్ 15) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు బన్నీవాసు(most eligible bachelor producer). ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
"భార్యాభర్తల అనుబంధాలను, వైవాహిక జీవితం గొప్పతనాన్ని వివరిస్తూ చాలా సినిమాలొచ్చాయి. అందులోని ఓ సున్నితమైన అంశాన్నే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor trailer) చిత్రంలో కొత్త కోణంలో చెబుతున్నాం. ప్రతి కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి ఏమేం కావాలి.. ఎలా ఉండాలి? అన్నదే నేర్పుతారు. పెళ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా మెలగాలి? అని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. మేము ఆ అంశాన్నే దీంట్లో టచ్ చేశాం. పెళ్లికి ముందే కాదు.. పెళ్లయ్యాక ఎలా ఉండాలనేది పిల్లలకి నేర్పించండి? అనే విషయాన్ని ఈ చిత్రంతో చెప్పనున్నాం. సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం".
"అఖిల్‌పై(akhil most eligible bachelor) ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు.. ఓ సింపుల్ కథే చెప్పాలి, ఆ కథతో అఖిల్‌ను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో చాలా సున్నితంగా వెళ్లే కథ ఇది".
"భాస్కర్(bommarillu bhaskar new movie) స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు కానీ, సినిమా తీయడానికి అంత సమయం తీసుకోడు. నిజానికి ఈ చిత్రాన్ని మేము 85రోజుల్లోనే పూర్తి చేశాం. కరోనా పరిస్థితుల వల్ల షూట్‌కు ఆటంకాలు ఎదురవడం వల్ల రెండేళ్ల సమయం పట్టింది. కుటుంబ ప్రేక్షకుల్ని మునుపటిలా థియేటర్ల వైపు తీసుకురావాలంటే కచ్చితంగా ఇలాంటి పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు తీసుకురాక తప్పదు. ఎవరో ఒకరు రిస్క్ చేయాల్సిందే. గత నెలలో 'లవ్‌స్టోరీ'తో(Lovestory movie) ఆ రిస్క్ చేశారు. మంచి ఆదరణ దక్కింది. ఈనెలలో నావంతుగా ఈ సినిమాను తీసుకొస్తున్నా".